ప్రపంచానికి స్వాగతం..!

Welcome

ఆశ్చర్యం వేస్తుంది కదూ, అంతర్జాలంలో అనేకానేక తెలుగు బ్లాగుల లిస్టులోకి కొత్తగా చేరింది, కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం, ఇది మన ప్రపంచం ఇక్కడ మనల్ని ప్రశ్నించే వారుండరు ప్రియ కరీంనగర్ సోదరులారా కదలండి ముందుకి, ఇన్నాళ్ళుగా మీ గుండెల్లో రగులుతున్న ప్రేమోద్వేగాలకు ఇక ప్రాణం పోయండి ఇంకా ఉన్నాల్లు మీ భావాలని మీలో నిక్షిప్తం చేసుకుంటారు. మనలోని భావాల్ని ఈ ప్రపంచం ముందు పెడదాం మనలాంటి జిల్లా ప్రెమికులు, పుట్టిన భూమిపై మమకారంతో ఇంత తపించిపోయేవారున్నారా అని ప్రపంచం ఆశ్చర్య పోయేలా చేద్దాం.

రెక్కలొచ్చేవరకే పక్షి గూటిలో ఉంటుంది, ఒక్కసారి దాని రెక్కల్లో సత్తువ వచ్చింతరువాత తన కన్న వాళ్ళని లెక్కచేయకుండా విశాల ఆకాశంలో తన గమ్యాన్ని వెతుకుతూ తుర్రుమంటుంది, కాని మనం మనుషులం అలా చేయడనికి ఎంతో కొంత ఆస్కారం ఉన్నా మనలోని వివేకం మానవత్వం జన్మనిచ్చిన తల్లిదండ్రులని, జన్మభూమిని మరవనివ్వదు….జిల్లాలో, దేశంలో సరయిన ఉపాది అవకాశాలు లేక వలస వెళ్ళిన మనలాంటి జీవులకు కష్టసుఖాలు పంచుకోవడానికి, క్షణాల్లో కలుసుకోవడానికి ఇప్పుడు సులువైన మార్గం అంతర్జాలం…కదలండి ముందుకు మీ మీ భావాలకు పట్టిన చెదలును దులిపి తేజోవంతులు కండి.

మీరు ఏ భాషలోనైనా రాయండి వర్డ్‌ప్రెస్ మన బాషను అర్థంచేసుకుంటుంది. అంతర్జాలంలో ప్రాంతీయ భాషల్లో రాయడాంకి అనేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని వెతకండి, త్వరలో నేనే మీకాపని చేసిపెడతాను. తెలుగులో వ్రాయడం కోసం లేఖినిని ఉపయోగించండి.

మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.

ఓ ప్రపంచమా ఇక్కడ నీకు నవ్వడానికి, ఏడవడానికి, జాలికి, కసికి, ఆవేశానికి, సంతొషానికి బోలెడంత సరుకు దొరుకుతుంది చూసి నేర్చుకో నీ మనసులో ఏమైనా ఉంటే మాతో పంచుకో.

కృతజ్ఞతలు
కరీంనగర్.ఇన్‌ఫో