అంతర్జాలంలో ఓ వందచిలుకు తెలుగు బ్లాగులు ఉన్నయి, మరి ఈ కరీంనగర్.ఇన్‌ఫో బ్లాగు ఎం పీకుతుంది అని ఎవరైనా అనుకుంటే….చదవండిది
వందభ్లాగులున్నాయి ఏ బ్లాగులోనయినా మీరు మీకుగా ఒక ప్రత్యేక విషయంపై చర్చ ప్రారంభించగలరా???? సమాధానం లేదనే వస్తుంది, ఆ బ్లాగువాడు దయతలిచితే వాడి విషయాలకు మీరు మీ అభిప్రాయాలను వెల్లవించాల్సి ఉంటుంది,
కానీ మన కరీంనగర్ బ్లాగుల ప్రపంచం అలా కాదు, మీరు ఆలోచిస్తున్న విషయంపైన మీకు తోటివారి అభిప్రాయాలు కావాలనిపించినప్పుడు, మీరు చేయవల్సిందల్లా మీ యూజర్ నేము, ఈమైలు అడ్రసు ఇచ్చి ఒక్కమీట నొక్కడమే, మీ సభ్యత్వం నమోదుకాబడుతుంది. మీ పాస్‌వర్డ్ సంకేతపదం మీకు ఈమైలులో వస్తుంది, దానితో మీరు కరీంనగర్ బ్లాగుల ప్రపంచంలో అడుగిడి మీ విషయాలకి ఇతరుల సలహాలు వివరణలు కోరవచ్చు, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అపుడు మీ సంకేత పదం(పాస్‌వర్డ్)ని మార్చుకోవచ్చు.
మీకు భయం అవసరంలేదు, మీరు వ్రాసిన విషయాలని కేవలం మీరు మాత్రమే మార్పుచేయడానికి వీలవుతుంది, వేరెవరూ మీ విషయాలలో తలలు దూర్చరులెండి. మీరూ మరీ అబ్యంతరకర విషయాలు అతి ఎక్కువ లోతుకు వెళ్ళి ఇక్కడ వ్రాస్తె, కరీంనగర్ బ్లాగుల ప్రపంచం పెద్దాయన (అడ్మిన్) మీ వాక్యలని తొలగించే అవకాశం ఉంది, అందుకనీ అందరూ చదువుకునే విధంగా ఉపయోగకరమైన విషయాలగురించి ఇక్కడ చర్చిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
ఇక్కడ మీరు చదువుగురించి చర్చించండీ, రాజకీయంగురించి చర్చించండీ, సాంకేతికత గురించి చర్చించండీ, సినిమాల గురించి చర్చించండీ, మీ సమస్యలగురించి చర్చించండీ, మీ పక్కవాళ్ళా సమస్యలగురించిచర్చించండీ, మితిమీరని శృంగారం గురించి చర్చించండీ, సఘటు జీవి జీవనం గురించి చర్చించండీ, మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి చర్చించండీ, మీ స్కూల్లో సైన్సు టీచర్ గురించి చర్చించండీ,…..విషయమేదైనా కనీస కట్టుబాట్లకు లోబడి ప్రచురించిన ప్రతి విషయం ఇక్కడ ఆదరించబడుతుంది.
మన కరీంనగర్ బ్లాగుల ప్రపంచం నుండి మీ పెద్దాయన.