దేశబాషలకెల్ల తెలుగు లెస్స, మనలో చాలామంది తెలుగు రాయడం మర్చిపోతున్నారు, మన పిల్లకు తెలుగు మాట్లాడడంకుడా మర్చిపోతున్నారు, కొన్నాళ్లాకు తెలుగు అనే ఒకా బాష ఉందని మనదరం మర్చిపోతాం, అలాంటి దయనీయ పరిస్థితికి మన మాతృభాష రాకూడదని అంతర్జాలంలో అనేకానేక బాషాభిమానులు తెలుగుని బ్రతించుకోవటానికి అతృతపడుతున్నారు, అలాంటి ఉద్వేగం నుంచి పుట్టిందే ఈ బ్లాగు.
ఇక్కడ మిమ్మల్ని సాధ్యమయినంతవరకు తెలుగులోనే వ్రాయాలని అర్థిస్తున్నాం, వివిధ దేశాల్లొ స్తిరపడినవారు తెలుగును కొంతవరకు మాట్లాడగలిగినా అచ్చుతప్పులేకుండా మాత్రం వ్రాయలేక పోతున్నారు, ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే ఇంత మధురమైన భాషని తప్పుల తడకగా చేస్తున్నాందుకు మనమందరం సిగ్గుపడాలి. తగ్గిపోయిన మన తెలుగు వాడుకను తీరికా సమయల్లో కనీసం ఈ విధంగానైనా బతికించుకుందాం అన్న ఒకానొక ముఖ్య ఉద్ధేశ్యంతో ఈ బ్లాగు ప్రారంబమయినా తెలుగులో రాయమంటే ఏం వ్రాస్తారు ఏదో ఒక విషయం ఉండాలిగా, ఇక్కడ మనకి విషయలేం అక్కరలేదు, మీరు మీ మనసులో ఎమనుకుంటున్నారో ఇక్కడ వ్రాయండీ అదే పదివేలు అది ఏ విషయానిదైనా సరె.
గత వారం అట్లాంటలో జరిగిన ఉగాది విషయలైన సరే, నిన్న కేసీఆర్ చేసిన కూలి పనైన సరే ఏ విషయం వ్రాసిన మిమ్మల్ని అడిగేవారుండరు, అలా అని ఈ బ్లాగును భూతు పుస్తంగా మాత్రం చెయ్యద్దని మనవి.
ఇక ప్రారంభించడి.