కరీంనగర్లోని హనుమాన్ నగర్ వాస్తవ్యులయిన వారాల ఆనంద్ గారు కరీంనగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు. ప్రముఖ రచయిత. తెలుగు లో ఎం.ఏ చేసి, లైబ్రరీ సైన్సులో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకున్న ఆనంద్ గారు శాతవాహన సెంటర్ ఫర్ కరీం నగర్ లిటరేచర్, కల్చర్ అండ్ హిస్టరీ స్థాపించి అందులో వందలు వేలాది పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆయన రాసిన నవ్య చిత్ర వైతాళికులు పుస్తకం హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 1999 కార్యక్రమంలో రిలీజ్ చేయబడింది. ఇవే కాక బాలల చిత్రాలు, సినీ సుమాలు మొదలయిన రచనలు చేసారు. ఎన్నో డాక్యుమెంటరీ ఫిల్ములు చిత్రీకరించారు. స్వతహాగా ఫిల్మ్ క్రిటిక్, విలేఖరి అయినటువంటి ఆనంద్ గారు ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సెక్రటరీగా తన వంతు బాధ్యత ఎంతో సమర్థంగా నిర్వహించారు, ఈనాడు మొదలయిన దినపత్రికలకు పనిచేసారు.
google pages: http://varalaanand.googlepages.com
phone: 918782235897, CELL : 919440501281
వారాల ఆనంద్ రచనలు కొన్ని
మానేరు తీరం
ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును, పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం నేల తల్లిని ఆర్తిగా తడుముతూ గమ్యం వైపు సాగిపోతుంది. సాగిపోతున్న ప్రవాహానికి ఆద్యంతం తిరం అంటిపెట్టుకునే వుంటుంది. నదికి ప్రవాహం ఊపిరైతే తీరం దేహమవుతుంది. తీరం దేహానికి ప్రవాహపు అంతర్లయ ఉచ్చ్వాస నిశ్వాసమవుతుంది. గల గల సాగే నది మొత్తంగా సజీవరూపమయితే నదికి మమతానురాగాలు ఉంటాయి, ఆవేశాకావేశాలు ఉంటాయి, బతుకు పోరాతాలుంతాయి. అవును నదిలాగే జీవితమూ ఓ ప్రవాహమే అనుక్షణం ఆరాటమే అంటూ మనిషి జీవితాని, నదికి మధ్య సారుప్యత తెలియపరిచిన ఆనంద్‌గారి “ప్రవాహం” ఒక అద్భుత కావ్యం. మానేరుతీరం పేర వెలువడిన ఈ సంకలనంలో మొత్తం 17 వచన కవితలున్నాయి మనిషి జీవితంలో ముఖ్య అనుభుతులని వాటి వెనుక దాగిఉన్న సత్యాసత్యాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు ఇందులో. “మౌనం” గురించి మాట్లాడుతూ…మౌనం మనిషికి ఓ మహత్తరమైన ఆచ్చాదన, మౌనంగా ఉండడమంటే మాటలు రాకపోవడం కాదు, మౌనంగా ఉండడమంటే మాటలు లేకపోవడమూ కాదు, మౌనంగా ఉండడమంటే మాటలు చేత కాకపోవడమూ కాదు..మౌనంగా ఉండడమంటే లక్ష భావాల్ని మన పెదల నడుమ దాచుకోవడం అంటారు, కోటి అనిభూతుల్ని మన కనురెప్పల కింద నిక్షిప్తం చేసుకోవడమంటారు.సినీ సుమాలు - భారతీయ సినిమాల్లో స్త్రీ
ఏదో కాలక్షేపం కోసం చూసే సినిమా, సినీ విశేషాలనూ సదరు రాతలను, రాతగాళ్ళనూ సీరియస్‌గా తీసుకోవడమేమిటని చదువుకున్న పెద్ద వాళ్ళతో సహా చాలామందికి ఉన్న దురభిప్రాయం. సినిమాను కాలక్షేపంకోసమే కాక, సమాజంపై ప్రభావం చూపే సాధనంగా సీరియస్‌గా తీసుకుని, తాము నమ్మిన విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు అరుధుగానైనా ళేరంటే వారు ఒప్పుకోరు. అలాంటి వారిని సైతం ఒపించగల సీరియస్ సినీ పరిశీలకుల్లో ఒకరు వారాల ఆనంద్, వారి రచన సినీ సుమాలు - భారతీయ సినిమాల్లో స్త్రీ, సమాజంలో వివిధ రంగాల్లో వందల ఏళ్ళుగా స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షత అందరికీ తెలిసిందే, ఆ వివక్షతలో మరి భారతీయ చలనచిత్రాల్లో స్త్రీ జీవిత చిత్రీకరణ ఎలా జరిగిందన్న దానిపై ఆయన చాలా సినిమాలు, సినీ చరిత్రను విశ్లేసించి మనముందుకు తీసుకువచ్చిన పరిశీలనాత్మక గ్రంథం ఈ “సినీ సుమాలు”
భారతీయ సినిమా చరిత్రని గమనిస్తే మొదట్లో పురాణాల్లోని పతివ్రతలు పతులే దైవమనే స్త్రీ మూర్తులే సినిమాల్లో ఎక్కువగా కనిపించే వారు, తరువాత కాలంలో కొద్దిగా మార్పులు వచ్చి స్త్రీని శక్తి స్వరూపిణిగా చిత్రీకరించడం జరిగింది, వితంతు పునర్విహా వివాహాలు , మతాంతర వివాహాలు, వరకట్నం లాంటి సమస్యలను చర్చించడం, ఉద్యోగినులైన మహిళల జీవిత చిత్రణ పైన పాత్రలూ సినిమాల్లో చోటుచేసుకున్నాయి, వివాహిత స్త్రీ అద్దె గర్భాన్ని అందించింది, వేరొకరి బిడ్డకి జన్మకిచ్చే “సర్రొగేట్ మదర్” పాత్రల వరకు తాజా చిత్రాలు, స్త్రీల సమష్యల్ని చర్చించడం కన్నా స్ర్తీని ఒక విలాస వస్తువుగానే చూపడమే ఇప్పటికీ జరుగుతుంది వీటిని వరల ఆనంద్ తన వ్యాసాంశాలలొ క్షుణ్ణంగా చర్చించారు. ఆయన వ్యాసాలు సినిమాల్లోని స్త్రీ పాత్రలేకాకుండా నిజజీవితంలో స్త్రీ వివ్కణ ఎలా సాగుతుందో ఈ దేశంలో చక్కగా చర్చించంచిన ఆయన ప్రయత్నం ఎంతైనా ప్రశంసించ దగ్గది.
బాలల చిత్రాలు
పిల్లల సినిమాలు, నాటకాలు అని మనం అనే వాటిల్లో మామూలుగా మూడు రకాల వర్గీకరణ్ అనిపిస్తుంది పిల్లకోసం, పిల్లల చేత, పిల్లపైన అనే ముడు కోవలకు మయట పిల్లపైన పెద్దలకోసం అనే మరో కొత్త కోవనొకదాన్ని ఇప్పుడు చేర్చాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇప్పుడు తెలుగులో వస్తున్న పిల్లల చినిమాల్ని చూస్తుంటే, సినిమాల్లో పిల్లల పట్ల చిన్నచూపుతోపాటు, వారి మానసిక స్థాయి మట్టనికి మించి ఉంటుంది.
బాలల సినిమాలపై తెలుగులో తగినంత కృషి జరగలేదు అన్న బాధతోనే వారాల ఆనంద్ గారు వెలువరించిన “బాలల చిత్రలు” చదువుతూ వుంటే మదిలో చాలా ప్రశ్నలు మెదులుతాయి, పరిమితులతోనే అయినా చాలా శ్రమతో కూర్చిన ఈ చిన్ని పుస్తకాన్ని జాతీయ, అంతర్జాతీయంగా వెలువడ్డ బాలల సినిమాల నేపథ్యం, చరిత్ర, పరిణామాల గురించి వారాల ఆనంద్ సచిత్ర, సవివరాత్మక వ్యాస సంకలనాన్ని తీర్చి దిద్దదంలో విజయం సాధించారు.
బాలల సినిమల గురించిన చర్చ మన దగ్గిర ఇప్పుడిపుడే మొదలవుతున్న, బాల్యం గురించిన చర్చ మాత్రం కవిత్వమంత పతదే, కానీ దీన్నిపుడు కొత్తగా తవ్వుకోవాల్సిన అవసం మాత్రం ఉంది. తెలుగు సినిమాల్లో బాలల పరిస్థితి చెప్పనక్కరలేదు, కానీ బాలల సినిమాల్లో కూడా బాల్యం గురించిన కొన్ని స్టీరియో అపోహలున్న చాయలు కనిపిస్తున్నాయి, ఈ పుస్తకం కూడా అదే నిస్సహాయతను చెప్పకనే చెపుతోంది.
నవ్య చిత్ర వైతాళికులు
కదిలే బొమ్మ కవిత్వమైంది, హృదిని వదలని సంగీతమైంది, వెన్నంటి వేదనైంది. వీడని సంగర్షనైంది. కాలాన్ని చెక్కుతున్న ఉలి అయ్యింది, వందేళ్ళ సినిమా ఇవ్వాల్ల ఆధునిక మానవుడికి అందుబాటులో ఉండే కళారూపమైంది. ఈ ప్రస్థానంలో సినిమా కళకు ప్రపంచవ్యాప్తంగా కొత నగిషీలు చెక్కిన దర్శకులు పలువురు ఉన్నారు. వారికి సినిమా మధ్యమం కేవలం వినోధాన్ని అందించే సాధనం కదు, వారికది వాస్తవాన్ని చిత్రీకరించేందుకు ఉపయోగపడే బలమైన ఆయుధం, మనిషి జీవితంలోని సంగర్షణలని, వాస్తవ, అధివాస్తవ, ఐంద్రజాలిక మాయా జగత్తును ఆవిష్కరించెందుకు చేస్తున్న ప్రయత్నం. ఇవేవీ కాకపోతే రోజూ వారి జీవితాల్లో జీవితంలాంటి వచనం, సినిమా మాధ్యమంలోని ఇన్ని పార్శ్వాలను స్పృషిస్తున్నది నవ్యచిత్ర దర్శకులే, మొత్తంగా ఆ కళను వ్యపారంగానే నమ్ముతున్న వారితో పోలిస్తే వీరి సంఖ్య బహు స్వల్పం.
మనదేశంలో నవ్య చిత్రాలకు ఒరవడి పెట్టిన వారు, వాటిని కొనసాగిస్తున్నవారి గురించి ఒకచోట గుదిగుచ్చి చెప్పే పుస్తకాలు లేవు, ఫిలంసొసైటీలు వేసే సావనీర్లు, చిత్రోత్సవాల సందర్బంగా విమర్శకులు రాసే వ్యాసాల్లొ తప్ప నవ్య సినిమా దర్శకుల గురించి గాని, ఆ చిత్రాల తీరుతెన్నుల గురించిగాని సమగ్రంగా పుస్తకం వెలువడలేదు, ఆ లోతును కొంతైనా తీర్చాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రాంతలోని పలు ఫిలం సొసైటీలతో సంబందం ఉన్న ఆనంద్ “నవ్య చిత్ర వైతాళికులు” పేరుతో అందంగా పుస్తకాని తెచ్చారు. మన దేశంలో నవ్యవాస్తవిక చిత్రాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు లబ్ధప్రతిష్టులైన 54మంది దర్శకులను ఈ పుస్తకంలో క్లుప్తంగా పరిచయం చేశారు, పేరెన్నిక గన్న వారి సినిమాల గురించి రేఖా మాత్రంగా తెలిపారు.
December 3rd, 2009 at 10:13 pm
నేను మొట్టమొదటి సారి శ్రీ వారాల ఆనంద్ గారు సమర్పించిన వీడియో డాక్యుమెంటరీ “సామల సదాశివ” చూడడం జరిగింది. బహుశా అది “ఈమాట ” లో అనుకుంటా. ఎంతో అద్భుతంగా ఉంది. నేను అప్పటికే సామల సదాశివ గారి కొన్ని రచనలను చదివి ఉండడం మూలాన, ఆ వీడియో డాక్యుమెంటరీ నాకు చాలా బాగా నచ్చింది. తరువాత “ముద్దసాని రామిరెడ్ది ” “వీడియో డాక్యుమెంటరీ ” చూశాను. అది కూడా గొప్పగా వుంది. ఇలా మంచి వీడియోలను సమర్పిస్తున్న వారికి నా హార్దికాభివందనములు.
అలాగే నేను కూడా కరీంనగర్ జిల్లా , ఎలగందుల గ్రామం నుండి వచ్చిన వాడినే. మా గ్రామంలో ఒక గొప్ప చారిత్రాత్మక కట్టడం ఉంది. అదే ఎలగందుల ఖిల్లా .దానిపై శ్రీ వారాల ఆనంద్ గారు ఒక మంచి డాక్యుమెంటరీ తీస్తే ఎంత బాగుంటుందో అని నా ఆకాంక్ష.
నా తెలుగు వికిపీడియా వ్యాసం [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%8E%E0%B0%B2%E0%B0%97%E0%B0%82%E0%B0%A6%E0%B0%B2%E0%B1%8D&action=edit] మా వూరు ఎలగందల్ చూడండి.
December 3rd, 2009 at 10:47 pm
క్షమించండి. URL తప్పుగా ఇవ్వబడింది. ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఎలగందల్