ఏమవుతుందక్కడ???????

Politics & Social Welfare Add comments

what hapening there in gulf????గత మూడు నెల్లలో దాదాపు 7గురిపైగా కరీంనగర్‌వాసులు మస్కట్, దుబాయ్, ఓమన్, యుఎఈ ఇతర ప్రాంతాల్లో మృత్యువాత పడ్డారు, వీరందరూ కేవలం రోడ్డు ప్రమాదాల్లో, కంపనీలలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, ఎందుకిలా జరుగుతుంది, వీరి మరణాలను ఆపలేమా, గడిచిన నాలుగైదు సంఘటనలు చూస్తే ఇవి కేవలం వారి అవగాహన, అనుభవలోపంవల్ల జరిగినట్లుగా కనిపిస్తుంది. ఇతర దేశాల్లొ రోడ్లపై పాదచారులకున్న నిబందనలు వీరికి తెలియకపోవడం వల్ల, ఫ్యాక్టరీల్లో అనుభవంలేని పనిపై కుదరటంవల్ల సరయిన శిక్షణ లేకుండనే వీరందరూ పెద్దపెద్ద యంత్రాలవద్ద పనికి కుదర్చబడుతున్నారు ఇలాంటివి అరికట్టాలంతే మనవంతు కృషి చేయక తప్పదు.

బ్రతుకు తెరువుకోసం, కష్టాలన్నీ గట్టెక్కుతాయన్న విశ్వాసంతో పని దొరికిందన్న ఆనందం పూర్తిగా అనుభవించకముందే వీరిని మరణం ఆవహిస్తుంది, ఈ ఈ ప్రాంతాల్లో ఉన్న మన కరీంనగరీయులు అనుభవం ఉన్నవారు సెలవుదినాల్లో ఇలాంటి అభాగ్యులకి చిన్న చిన్న అవగాహనా సదస్సులు నిర్వహిస్తే ఈ విపరీతాలను కొంత వరకైనా తగ్గించినవారమవుతాం.

మామూలు కూలి పనికి కాకుండా మంచి స్థానాల్లో ఉన్నవారు, చదువుకుని ఈ ప్రాంతాల్లో వివిధ రంగాలలో ఆరితేరిన మనవారి సంఖ్య తక్కువేంకాదు, మీ అందరికీ కరీంనగర్.ఇన్‌ఫో ప్రత్యేక విన్నపం మనవారికి సహాయంచేయండి, కుటుంబ పరిస్థితులు బాగాలేని కారణంగా పొట్టచేత పట్టుకువచ్చిన వీరిపై దయచూపి మీ వంతు సహకారం అందించండి.

ప్రభుత్వ పథకాలన్నీ కాగితాలకూ, మీడియాకే పరిమితమై పోతున్న ఈ కాలంళో మన తోటి వారికి మనమే సహాయపడాలి, పదండి చేతులి కలిపి మన సహకారాన్ని మన సోదరులకందిద్దాం.

మీమీ అనుభవాలను కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచంలో పొందుపరచండి, రండి ఈ సమస్యకి మీమీ పరిష్కాల్ని ఇక్కడ పొందుపరచండి, మీ చిన్న చిన్న సలహాలు, మీరిచ్చే అభిప్రాయాలు వేలమందికి ఉపయోగపడవచ్చు.

3 Responses to “ఏమవుతుందక్కడ???????”

  1. chandramouli Says:

    అవిఘ్నమస్తు! సర్వప్రయత్నఫల సిద్దిరస్తు…..

  2. Juvvadi Srinivas Rao Says:

    WE (GULF TELANGANA WELFARE &CULTURAL ASSOCIATION )organising some awareness programms here in UAE.
    thank you
    Juvvadi Srinivas Ro
    Vice President
    GTWCA

  3. Kiran Says:

    please send me ur e-mail id thanku

Leave a Reply