మైనింగ్ యునివర్సిటి తెలంగాణకే ఎందుకు..?

Technology - posted by karimnagar.info on September 5th, 20083 Comments »

The main demand of The collery kavatu is to establish “mining university” in Telangana. (Govt proposed to start it in vizag)

ఈప్పటి వరకు దేశం లో ఉన్న ఒకే ఒక మైనింగ్ యునివర్సిటి ధన్ బాద్ లో మాత్రమే ఉంది. అక్కడ గనులు చాలా ఉన్నాయి కాబట్టి అది సమంజసమే. ఈమద్యనే ప్రభుత్వం దేశం లో ఇంకా రెండు మైనింగ్ యునివర్సిటిలను పెట్టాలి అనుకుంది. అందులో ఒకటి మధ్య ప్రదేశ్ కు ఇంకోటి ఆంధ్ర ప్రదేశ్ కు మంజూరైంది.

ఆక్వాకల్చర్ & సెరికల్చర్ యునివర్సిటిలు అన్నీ ఆంధ్రా లోనే ఉన్నాయి. అక్కడ సముద్రం ఉంది కాబట్టి మనం కూడ ఆంధ్రాలో వాటి ఏర్పాటు ను వ్యతిరేకించలేదు. కాని నాలుగు జిల్లాల్లో గనులు విస్తరించి ఉన్న తెలంగాణ ను కాదని కనీసం గని అంటే ఎంటో కూడా తెలియని ఆంధ్రా లొ మైనింగ్ యునివర్సిటి పెడుతం అనడం ఈ ప్రభుత్వపు మరో దారుణం. తెలంగాణ కార్మికుల పై అజమాయిషీ చేసే అధికారులుగా ఒక ప్రాతం వారిని దిగుమతి చేసుకోవాలనే దుర్మార్గపు ఆలొచన ఇది.

తెలంగాణలో యూనివర్సిటీ ఉండడం వల్ల ఇన్ని రోజులు బొగ్గు తవ్వే పనికే పరిమితమైన గని కార్మికులు వారి పిల్లల్ని ఉన్నతోద్యోగులుగా చూడగలుగుతారు. లేకపోతే మన ముందు తరాలు కూడా ఇదే పనికి పరిమితం కావల్సి ఉంటది.

1,20,000 మంది ఉద్యోగులున్న సింగరేణి ఈరోజు 70,000 మందికి కుదించబడ్డది. 100 కోట్ల లాభాన్ని చూపుతున్న దొంగలు 750 కోట్ల రూపాయలను ప్రభుత్వం పన్నుల రూపం లో మింగుతుందన్న విషయం దాచిపెడుతున్నరు. పనికి రాని ప్రైవేటు కంపెనీలకు వేల కోట్ల విలువైన భూముల్ని కైంకర్యం చేసి, ఆ కంపెనీలకు అన్ని రాయితీలనిచ్చే ప్రభుత్వం సింగరేణి లాభాలను మాత్రం గద్దలా తన్నుకుపోతుంది.

అక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ ఉండడం వల్ల కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యావకాశలు అందుబాటులకి వస్తయి. తట్ట మోసిన కార్మిక సోదరుడి ఇల్లు సింగరేణి కి ఒక అధికారిని ఇవ్వొచ్చు. టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగావకాశాలు ఏర్పడుతయి. కరీం నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అభివ్రుద్ధి చెందుతయి. అధిక శ్రమ చేసే కార్మికులకు వారి పనిలో మేలు చేసే పరిశొదనలు కొనసాగుతాయి. (ముందు కార్మికులు ఇనుప టోపీ వాడేవారు దీని వల్ల 8 గంటలు బరువైన టోపీ ని మోయవలసి వచ్చేది. ఇప్పుడు ప్లాస్టిక్ టోపీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఇలాంటివి.). విద్యార్థులు & అధ్యాపకులు కార్మికుల కష్టాల్లో భాగం అవుతరు. వారి సమస్యల పట్ల స్పందిస్తరు, ఉద్యమిస్తరు.

అందుకే మైనింగ్ యూనివర్సిటీ తెలంగాణకు రావడం అవసరం. న్యాయం కూడా.

- naveen achari
Telangana IT Forum

పెద్దపెద్ద పనులు చేయకుండా చిన్నచిన్న నియమాలు

Technology - posted by karimnagar.info on April 19th, 20082 Comments »

అంతర్జాలంలో ఓ వందచిలుకు తెలుగు బ్లాగులు ఉన్నయి, మరి ఈ కరీంనగర్.ఇన్‌ఫో బ్లాగు ఎం పీకుతుంది అని ఎవరైనా అనుకుంటే….చదవండిది

వందభ్లాగులున్నాయి ఏ బ్లాగులోనయినా మీరు మీకుగా ఒక ప్రత్యేక విషయంపై చర్చ ప్రారంభించగలరా???? సమాధానం లేదనే వస్తుంది, ఆ బ్లాగువాడు దయతలిచితే వాడి విషయాలకు మీరు మీ అభిప్రాయాలను వెల్లవించాల్సి ఉంటుంది,

కానీ మన కరీంనగర్ బ్లాగుల ప్రపంచం అలా కాదు, మీరు ఆలోచిస్తున్న విషయంపైన మీకు తోటివారి అభిప్రాయాలు కావాలనిపించినప్పుడు, మీరు చేయవల్సిందల్లా మీ యూజర్ నేము, ఈమైలు అడ్రసు ఇచ్చి ఒక్కమీట నొక్కడమే, మీ సభ్యత్వం నమోదుకాబడుతుంది. మీ పాస్‌వర్డ్ సంకేతపదం మీకు ఈమైలులో వస్తుంది, దానితో మీరు కరీంనగర్ బ్లాగుల ప్రపంచంలో అడుగిడి మీ విషయాలకి ఇతరుల సలహాలు వివరణలు కోరవచ్చు, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అపుడు మీ సంకేత పదం(పాస్‌వర్డ్)ని మార్చుకోవచ్చు.

మీకు భయం అవసరంలేదు, మీరు వ్రాసిన విషయాలని కేవలం మీరు మాత్రమే మార్పుచేయడానికి వీలవుతుంది, వేరెవరూ మీ విషయాలలో తలలు దూర్చరులెండి. మీరూ మరీ అబ్యంతరకర విషయాలు అతి ఎక్కువ లోతుకు వెళ్ళి ఇక్కడ వ్రాస్తె, కరీంనగర్ బ్లాగుల ప్రపంచం పెద్దాయన (అడ్మిన్) మీ వాక్యలని తొలగించే అవకాశం ఉంది, అందుకనీ అందరూ చదువుకునే విధంగా ఉపయోగకరమైన విషయాలగురించి ఇక్కడ చర్చిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.

ఇక్కడ మీరు చదువుగురించి చర్చించండీ, రాజకీయంగురించి చర్చించండీ, సాంకేతికత గురించి చర్చించండీ, సినిమాల గురించి చర్చించండీ, మీ సమస్యలగురించి చర్చించండీ, మీ పక్కవాళ్ళా సమస్యలగురించిచర్చించండీ, మితిమీరని శృంగారం గురించి చర్చించండీ, సఘటు జీవి జీవనం గురించి చర్చించండీ, మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి చర్చించండీ, మీ స్కూల్లో సైన్సు టీచర్ గురించి చర్చించండీ,…..విషయమేదైనా కనీస కట్టుబాట్లకు లోబడి ప్రచురించిన ప్రతి విషయం ఇక్కడ ఆదరించబడుతుంది.

మన కరీంనగర్ బ్లాగుల ప్రపంచం నుండి మీ పెద్దాయన.