విశ్వంలోని రహస్యాలను చేదించే సత్తా ఉందా మనలో?
Health & Science - posted by karimnagar.info on September 11th, 20082 Comments »
కరీంనగర్ డాట్ ఇన్‌ఫో ప్రత్యేకం

2012 సంఖ్య ఇంటర్నెట్‌లో ప్రాధన్యత సంపాదించుకుంది, ప్రపంచంలోని లక్షలాది మంది రోజూ ఈ సంఖ్యను చూస్తూ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు, ఇప్పుడే 2012లో మనిషి జీవనానికి అవసరమయిన వస్తువుల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి ఆనాటి పరిస్తితులకనుగునంగా మీకు నివసించడానికి ఇళ్ళు, వస్త్రాలు, ఊపిరి పీల్చడానికి అవసరమయిన మాస్కులు, తినడానికి కావల్సిన సింథటిక్ ఫుడ్ క్యాన్‌ల అమ్మకాలు ఇంటర్‌నేట్‌లో ఊపందుకుంటున్నాయి. భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్న పరిస్థితుల్లో ప్రపంచ్చవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తో(భూతాపానికి) మనిష్య జనాభా అంతరించే సమయం దగ్గరలోనే ఉందని తెలిసీ రేపటి ఆశతో జీవిస్తున్నవారు కోట్లమంది ఈ భూమిపై ఉన్నారు అలాంటి వారి ఆసక్తి, ఈ 2012 విశ్వసమాప్తి హెచ్చరికలు దానికి సంభందించిన వివరాల వెబ్‌సైట్లు, పుస్తకాలు, వస్తువులకు గిరాకీ పెరుగుతుంది.
ఇక నిన్న జెనీవాలో ప్రారంభమైన “బిగ్ బ్యాంగ్” ప్రయోగం సగటు మనుషుల్ని ఇంకా బయపెడుతోంది, విశ్వ రహస్యాలను కనుగొనటానికి ఆనాడు విశ్వంలో జరిగిన బారీ పేలుడే ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రణాళిక బద్దంగా కల్లారా చూడాలని ప్రారంభించారు, కొన్ని వేల కోట్ల ఖర్చయ్యే ఈ ప్రయోగంలో అన్ని దేశాలు తమవంతు సాయాన్ని ఆర్థికంగా, సాంకేతింగా, వైజ్ఞానికంగా అందజేస్తున్నాయి. మన దేశం ఈ ప్రయోగానికి 50 మిలియన్ డాలర్ల సాంకేతిక పరిజ్ఞానం సమర్పించుకుందని వార్త.
జెనీవాలో తలపెట్టిన ఈ ప్రయోగం విశ్వనాశనానికేనని 25శాతం ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు, నిన్నటి తొలి ప్రయోగం సఫలంతో ప్రయోగ సాంకేతిక వర్గాల్లో చిరునవ్వులు వెలిసాయి కాని ఈ చిరునవ్వులు ఎంతవరకు నిలుస్తాయి సృష్టికి విరుద్ధంగా వీల్లు తల పెట్టిన ఈ కార్యం మానవాలికి ఉపయోగపడుతుందా అంటే తప్పకుండా అని భలంగా చెపుతున్నారు ఐరోపా అణుపరిశోదన సంస్థ ప్రతినిధి పావోలా కటాపోనా, మన దేశంలోని శాస్త్రవేత్తలు కూడా ఇది మంచికోసం జరిగే ప్రయత్నమే అంటున్నారు.
నిన్న ఈ ప్రయోగం మొదలవుతుందని తెలుసుకున్న భారతీయులు చాలా వరకు తమ భవిష్యత్తును కాపాడాలని వివిధ మందిరాలను సందర్శించుకుని ఆ దేవుడ్ని వేడుకున్నారు, నిన్న ఉదయం మాములుగా కంటే ఎక్కువమంది వివిధ దేవాలయాల్లో దైవ దర్శనంచేసుకోవడమే ఇందుకు నిదర్శనం, తమ చేతుల్లో లేని భవిష్యత్తుని దేవుడు బాగా ఉండేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. ఈ శాస్త్రవేత్తల ప్రయోగం విఫలమవుతే విశ్వనాశనేనికి వీరే కారకులవుతారు.
స్విస్ ఫ్రెంచ్ సరిహద్దుల్లో భూమికి 600 అడుగుల క్రింద, 27కిలో మీటర్ల వృత్తాకారపు సొరంగంలో ఈ ప్రయోగం ఊపిరిపోసుకుంది ఈ సొరంగం నుండి రేడియేషన్ బయటికి రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు, నిన్న సొరంగంలోని లార్జ్ హార్డ్రన్ కొలైడర్(ఎల్.హెచ్.సీ)లోకి తొలిసారిగా రెండు ప్రోటాన్ పుంజాలను విడుదల చేశారు, వెంట్రుక పరిమాణంలో ఉన్న కాంతిపుంజాన్ని వృత్తాకారంలో ఉన్న ఎల్‌హెచ్‌సీలో పూర్తిస్థాయిలో ప్రయాణించిందని నిపుణులు తేల్చి చెప్పారు, తొలుత ఒక పుంజాన్ని సవ్య దిశలో తరువాత మల్లీ మరో పుంజాన్ని అపసవ్య దిశలో విజవంతంగా ప్రయాణింపజేశారు.
రెండవ దశలో ఈ రెండు ప్రోటాన్ పుంజాలని డీకొట్టిస్తారు అప్పుడు విశ్వపుట్టుకకి ఏర్పడిన వాతావరణం కృత్రిమంగా సృష్టించినవారవుతారు మరి అప్పుడు ఏం జరుతుంది అనేదీ పూర్తిగా ఎవరికీ తెలియదు.
కొన్ని వేల సంవత్సరాల క్రింద సహజసిద్దంగా జరిగిన ఇలాంటి ప్రక్రియ ద్వారానే ఇప్పుడు మనం వుంటున్న విశ్వం ఆవిర్భవించింది అందులోంచే భూమి, సూర్యుడు, ఇతర గ్రహాలు, జీవి(ప్రాణం), విశ్వ తొలిజీవి అమీబా జనించగా మనిషి మేధస్సుకు అందని మరెన్నో అద్భుతాలు విశ్వంలో జరిగాయి - అవే బ్లాక్‌హోల్స్ - వీటి గురించి ఇంకా ఎవరూ సరయిన వివరణ ఇవ్వలేక పోతున్నారు విశ్వంలో మన గ్రహాలతో పాటూ కాంతి కూడా ప్రసారం కాని ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నాయి అక్కడ జీవం ఉండదు కనీసం వాతావరణంకూడా ఉండదు..కాంతి కూడా చొరబడలేని ఆ భిలాలు భూమిని కూడ లాగేస్తాయని కొంతమంది శాస్త్రవేత్తలు చెపుతారు.
మరి ఇప్పుడు చేస్తున్న కృత్రిమ విశ్వ జనన ప్రక్రియ (బిగ్‌బ్యాంగ్) వల్ల కూడా కొన్ని వేల బ్లాక్‌హోల్స్ ఆవిర్భవించే అవకాశం లేకపోలేదు.. ఇప్పుడు ఈ రెండు ప్రోటాన్ కాంతి పుంజాల డీ వల్ల వెలువడే ఉష్ణం 25సూర్యుళ్ళకి సమానమయినది, మరి వీరు నిర్మించిన ఈ 27కిలోమీటర్ల టన్నెల్(సొరంగం) ఆ వేడిని తట్టుకోగలదా? సమాధానంలేని ప్రశ్న..ఈ ప్రయోగాన్ని నిక్షిప్తంచేయడానికి అత్యంత ఆధునిక పరిజ్ఞాంతో తయారుచేసిన కెమెరాలను వినియోగిస్తున్నారు ఈ కెమెరాలు ఒక్క సెకనుకు 2కోట్ల చిత్రాలను తీస్తుందని నిర్వాహకులంటున్నారు..మరి ఈ ప్రయోగం విఫలమయితే ఆ కోట్ల చిత్రాలను వీక్షించే నాధుడేది?