Maha is going to win in Knr
Politics & Social Welfare - posted by G Ashok UTF KNR on May 8th, 20091 Comment »After completion of first phase of elections in AP it has become clear that alliance of pol parites TDP, TRS, CPM, CPI is going to win
After completion of first phase of elections in AP it has become clear that alliance of pol parites TDP, TRS, CPM, CPI is going to win
నిన్న ,అనగా 24-1-2009 లో వచ్చిన వార్త పై కామెంట్ ” ఓటడగ వచ్చే చంద్రబాబుకు లేకపోయినా మాకు సిగ్గుందని చెప్పండి ” చిత్తురు జిల్లా కలిచెర్ల సభలో ప్రజలకు వైఎస్ పిలుపు. అంటే వైఎస్ ఉద్దేశం , చంద్రబాబుకు ఓటు వేసే వారందరికి సిగ్గులేదు అని అర్ధమేకదా .
అలా అని వైఎస్ ప్రజలను తిడుతున్నట్టా , బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టా . ఈ విషయం ఈ ఎలక్షన్లకేనా గత 1999 ఎలక్షన్లకు కూడా వర్తిస్తుందా .
అంటే గత ఎలక్షన్లలో ఓటు వేసిన వారందరికీ సిగ్గు లేదు అని తిడుతున్నట్టే కదా .
ఈ విషయమై వైఎస్ వివరణ ఇస్తే బాగుంటుంది కదా.

మహా కూటమి ఏర్పాటు తో కలవర పడ్డ కాంగ్రెస్ అధిష్టానం ఒక దశ లో తెలంగాణ ప్రకటించడానికి సిద్ధ పడింది. కూటమి ఏర్పాటు తో తెలంగాణ లో కాంగ్రెస్ గల్లంతు అవుతుందని ఆ ప్రాంత నేతలు మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో సహా కొందరు సీనియర్ నాయకులు అధిష్టానం చెవి లో పోరు పెడితే తెలంగాణ ప్రకటన చేయడానికి కసరత్తు చేసింది.
దీనికోసం ముఖ్యమంత్రి ని పిలిచి మాట్లాడి తమ వైఖరి చెప్పేసరికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేఖించినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి తో పాటు పార్టీ కి రాజీనామా చేస్తాను అని వైఎస్ బెదిరించినట్టు తెలుస్తుంది. దీనితో మెత్తబడ్డ అధిష్టానం ఈసారి స్టేట్ తో కాకుండా స్టేట్మెంట్ తో సరిపెట్టాలని నిర్ణయించింది.
ఇక ఎన్నికల లోపు తెలంగాణ వచ్చే అవకాశం కానీ ప్రకటించే అవకాశం లేవని తెలిసి పోయింది. ఏదైతేనేమి ఢిల్లీ నాటక రంగం పై డీఎస్ అవునని వైఎస్ కాదని తెలంగాణ నాటకం రక్తి కట్టించారు. ప్రస్తుతానికి తెలంగాణ వాహనాన్ని గారేజి లో పార్క్ చేసింది. పొలిటికల్ మైలెజ్ అవసరమైనప్పుడు మళ్ళీ బయటకి తీస్తుంది.
కాంగ్రెస్ మార్కు రాజకీయం: గత కొన్ని రోజులుగా ఢిల్లీ లో తెలంగాణ పై హడావిడి చేసి సత్యం స్కాం నుంచి ప్రజల దృష్టి ని మరల్చడానికి చేసిన ప్రయత్నం గా కనిపిస్తుంది అని పరిశీలకులు భావిస్తున్నారు.
Source: www.prawasi.com